Thursday, 4 October 2012

చింతచెట్టు-ఉసిరికాయ స్నేహం


నేను 5th క్లాసు అయిపోగానే మా నాన్నకి నెల్లూరు ట్రాన్సఫర్ అయింది.మొదటిరోజు నన్ను, మా చెల్లిని స్కూల్లో జాయిన్ చేయడానికి మా నాన్నవచ్చారు. నన్ను6th క్లాసురూం దగ్గరికి తీసుకెళ్ళారు.అప్పుడే ఒక అమ్మాయి  విండోలోనుంచి ప్లేగ్రౌండ్ నుంచి క్లాసురూంలోకి దూకింది. తనకి నన్నుపరిచయం చేసి వెళ్లారు  మా నాన్న.ఇక అప్పటినుంచి తనే నా ఫ్రెండ్. తన పేరు రమ్య. నేను తన పక్కనే కుర్చునేదాన్ని. తను బాగా అల్లరి ఏదో ఒకటి  మాట్లాడుతూనే ఉండేది. తర్వాత క్లాసులో మిగతా వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. మా స్కూల్ పక్కనే చిన్న   షాప్ లో స్కూల్ పిల్లల కోసం తినుబండారాలు అమ్మేవారు. నేరేడుకాయలు, కలేకాయలు, ఉసిరికాయలు ఇలా  చాలా ఉండేవి. మేము రోజూ సాయంత్రం క్లాసు అయిపోయాక పెద్ద ఉసిరి కాయలు కొనుక్కుని మా గ్రౌండ్ లో ఉన్న  చింతచెట్టు కింద కూర్చొని ఉసిరికాయలు తింటూ ఎన్నోకబుర్లు చెప్పుకునేవాళ్ళం.అవి అప్పుడు ఎంత రుచిగా  ఉండేవో. అలా చింతచెట్టు క్రింద కబుర్ల వల్ల ప్రశాంతి, ఝాన్సీ కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మేము  నలుగురం ఎప్పుడు జట్టుగా ఉండేవాళ్ళం. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. 8th క్లాసుకి వచ్చాక చిన్నచిన్న  గొడవలు పెట్టుకునేవాళ్ళం. అప్పుడు రెండు గ్రూప్స్ గా విడిపోయేవాళ్ళం. రమ్య ,నేను  ఒక  గ్రూప్ప్రశాంతి , ఝాన్సీ  ఒక  గ్రూప్. ఇప్పుడు అదంతా తలచుకుంటే నవ్వొస్తుంది. 8th ఎగ్జామ్స్ అయ్యాక రమ్య వాళ్ళ నాన్నగారికి  ట్రాన్సఫర్ అయిందని వాళ్ళు బుచ్చిరెడ్డిపాళెం వెళ్ళిపోయారు. తర్వాతి సంవత్సరం ప్రశాంతి కూడా వేరే స్కూల్ కి   మారిపోయింది. 10th కి వచ్చేటప్పటికి నేను, ఝాన్సీ మాత్రమే ఉన్నాం. అప్పుడు మా క్లాసు లో  ఒక అమ్మాయి  కొత్తగా చేరింది. తన పేరు వసంత. రోజు తను,నేను ఒకే దారిలో ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా రోజూ ఒకే దారిలో వెళ్తూబాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అప్పుడపుడు నేను వాళ్ళింటికి వెళ్ళేదాన్నితను మా ఇంటికి వచ్చేది. కలిసి చదువుకునేవాళ్ళం. 10th లో మా ఇద్దరికీ ఒకే మార్క్స్ వచ్చాయి. ఇంటర్ లో నేను ఎం.పి.సి తీసుకుంటే వాళ్ళంతా  బై.పి.సి తీసుకున్నారు. వేరు వేరు కాలేజీలు . చదువు గొడవలో పడి కాంటాక్ట్స్ తగ్గాయి . ఎప్పుడైనా  వసంతని  కలుస్తున్దేడాన్ని. ఝాన్సీ ఎప్పుడైనా కనిపించేది. అప్పుడు  ఇప్పటిలా మొబైల్  వాడకం అంత ఉండేది కాదు కాబట్టి కాంటాక్ట్స్ తక్కువ. నేను బి.టెక్ లో వేరే ఊరిలో జాయిన్ అయినా ఇంటికి వెళ్లినపుడల్లా వసంతని కలిసేదాన్ని. బి.టెక్  ఫైనల్ ఇయర్ కి వచ్చేటప్పటికి మిగతావాళ్ళు కూడా కాంటాక్ట్ లోకి వచ్చారు . వసంత ఎం.ఎస్.సి చేసింది. రమ్య, ఝాన్సీ , ప్రశాంతి బి. ఎస్. సి చేసారు. నేను బి.టెక్ అయిపోయేటప్పటికి  మా నాన్నకి  మళ్లీ ఒంగోలు ట్రాన్సఫర్ అయింది. నేను ఎం.టెక్ లో జాయిన్ అయ్యాక ఎప్పుడు ఇంటికి వెళ్ళిన తిరిగి కాలేజీకి  వెళ్ళేటప్పుడు నెల్లూరులో  దిగి వసంత వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వసంత ఎప్పుడు మీరంతా సాఫ్ట్ వేర్ వాళ్ళు మేము ఎక్కడలే  అంటూ ఉండేది. నేను విని నవ్వేదాన్ని. స్కూల్ అయ్యాక నాకు ఇంటర్ లో, బి.టెక్ లో, ఎం.టెక్ లో, ఇప్పుడు ఆఫీసులో బోల్డు  మందితో స్నేహం కుదిరింది. కానీ స్వార్థం తెలియని స్వచ్చమైన మనసుల  చిన్ననాటి స్నేహం నాకు ఎప్పటికి ప్రత్యేకమే.

ప్రస్తుతం : నేను ఎం.టెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రమ్య, ఝాన్సీలకి ఒకే నెలలో పెళ్ళిళ్ళు అయ్యాయి . సెమిస్టరు ఎగ్జామ్స్ ఉండడంవల్ల వెళ్ళలేకపోయాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు నెల్లూరు లోనే సెటిల్ అయ్యారు.    ప్రశాంతి పెళ్లి నేను ఎం.టెక్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు అయింది. ప్రాజెక్ట్ వర్క్  ఉండి వెళ్ళలేదు. తను  ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. ముగ్గురికి ఇప్పుడు ముగ్గురు బుజ్జి పాపలు. పోయిన ఏప్రిల్ లో వసంత పెళ్లి  అయింది. నేను వెళ్ళాను. మా అమ్మ కూడా వచ్చింది. ఎప్పుడు మీ సాఫ్ట్ వేర్ వాళ్ళు అనే  వసంత ఇప్పుడు అదే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.

No comments:

Post a Comment