కనురెప్పల చివరినుండి జారుతున్న కన్నీటిచుక్కని అడిగా
నువ్వెప్పుడు వస్తావని...
సమాధానమివ్వకుండా మౌనంగా జారి పెదవిని తాకింది...!!!
జాలైనా లేకుండా మనల్ని విడదీసిన ఈ విధిని అడిగా
నిన్నెప్పుడు చూస్తానని...
జవాబైనా చెప్పకుండా ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉండింది...!!!
మనమధ్య పెరిగిన భయంకరమైన ఈ దూరాన్ని అడిగా
ఎప్పటికి కరుగుతావమ్మ అని...
ఎప్పటికీ కరగను అని తన నిర్దయను చూపించుకుంది...!!!
వీచేగాలిని, పారేయేరుని,నీలాకాశాన్ని,కురిసే వర్షాన్ని,
పున్నమి చంద్రుని, వాకిట్లో పూచిన సన్నజాజుల్ని కూడా అడిగా
నువ్వెక్కడని...
సమాధానం లేదని సంకేతమిస్తూ మౌనంగా ఉండిపోయాయి ...!!!
Good one.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThank u Padmarpita :)
ReplyDelete