Saturday, 5 November 2011

కన్నీళ్ళే తోడుగా... మౌనమే భాషగా...


కనురెప్పల చివరినుండి జారుతున్న కన్నీటిచుక్కని అడిగా

నువ్వెప్పుడు వస్తావని...

సమాధానమివ్వకుండా మౌనంగా జారి పెదవిని తాకింది...!!!

జాలైనా  లేకుండా మనల్ని విడదీసిన ఈ విధిని అడిగా

నిన్నెప్పుడు చూస్తానని...

జవాబైనా చెప్పకుండా ఎప్పటిలాగే  నిశ్శబ్దంగా ఉండింది...!!!

మనమధ్య పెరిగిన భయంకరమైన ఈ  దూరాన్ని  అడిగా

ఎప్పటికి కరుగుతావమ్మ అని...

ఎప్పటికీ కరగను అని తన నిర్దయను చూపించుకుంది...!!!

వీచేగాలిని, పారేయేరుని,నీలాకాశాన్ని,కురిసే వర్షాన్ని,

పున్నమి చంద్రుని, వాకిట్లో పూచిన సన్నజాజుల్ని కూడా అడిగా

నువ్వెక్కడని...

సమాధానం లేదని సంకేతమిస్తూ మౌనంగా  ఉండిపోయాయి ...!!!