Tuesday, 24 September 2013

నువ్వు నువ్వు నువ్వే నువ్వు

నాకు చాలా ఇష్టమైన పాట "నువ్వు నువ్వు" . ఎందుకంత ఇష్టమంటే ముందుగా చెప్పాల్సింది శాస్త్రి గారి సాహిత్యం గురించి. పాట విన్న ప్రతిసారి ఒక్కొక్క లైన్ మనసుకి అలా హత్తుకుని పోతుంది. సుమంగళి గారు కూడా చాలా బాగా పాడారు. అక్కడక్కడ చిత్ర గారు గుర్తుకువస్తారు. దేవి శ్రీ ప్రసాద్ ఎంత మంచి ట్యూన్ ఇచ్చారో. ప్రతి లైన్ మళ్ళి రిపీట్  చేస్తూ పాడించడం చాలా బావుంటుంది. కృష్ణవంశి ఈ పాటని తన స్టైల్ లో రొమాంటిక్ గా తీశారు. కానీ వారి అన్నిసినిమాలలోని పాటల కన్నా నువ్వు నువ్వు పాట ఎప్పుడు టాప్ గా ఉంటుంది . నాకైతే రోజుకి ఒక్కసారైనా ఈ పాట వినాలనిపిస్తుంది. సోనాలి నటన కోసం చూడాలనిపిస్తుంది .నాకు ఇంత నచ్చిన ఈ పాట ఇక్కడ  :
 
చిత్రం : ఖడ్గం (2002)
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుమంగళి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
 

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ ….. 2
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా వయసుని వేదించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్దం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు
మెత్తని ముళ్ళే గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే కోరికవే నువ్వు
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
ఐనా ఇష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ నువ్వూ
నా పంతం నువ్వూ నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ నువ్వూ..
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ ….. 2

Thursday, 4 October 2012

చింతచెట్టు-ఉసిరికాయ స్నేహం


నేను 5th క్లాసు అయిపోగానే మా నాన్నకి నెల్లూరు ట్రాన్సఫర్ అయింది.మొదటిరోజు నన్ను, మా చెల్లిని స్కూల్లో జాయిన్ చేయడానికి మా నాన్నవచ్చారు. నన్ను6th క్లాసురూం దగ్గరికి తీసుకెళ్ళారు.అప్పుడే ఒక అమ్మాయి  విండోలోనుంచి ప్లేగ్రౌండ్ నుంచి క్లాసురూంలోకి దూకింది. తనకి నన్నుపరిచయం చేసి వెళ్లారు  మా నాన్న.ఇక అప్పటినుంచి తనే నా ఫ్రెండ్. తన పేరు రమ్య. నేను తన పక్కనే కుర్చునేదాన్ని. తను బాగా అల్లరి ఏదో ఒకటి  మాట్లాడుతూనే ఉండేది. తర్వాత క్లాసులో మిగతా వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. మా స్కూల్ పక్కనే చిన్న   షాప్ లో స్కూల్ పిల్లల కోసం తినుబండారాలు అమ్మేవారు. నేరేడుకాయలు, కలేకాయలు, ఉసిరికాయలు ఇలా  చాలా ఉండేవి. మేము రోజూ సాయంత్రం క్లాసు అయిపోయాక పెద్ద ఉసిరి కాయలు కొనుక్కుని మా గ్రౌండ్ లో ఉన్న  చింతచెట్టు కింద కూర్చొని ఉసిరికాయలు తింటూ ఎన్నోకబుర్లు చెప్పుకునేవాళ్ళం.అవి అప్పుడు ఎంత రుచిగా  ఉండేవో. అలా చింతచెట్టు క్రింద కబుర్ల వల్ల ప్రశాంతి, ఝాన్సీ కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మేము  నలుగురం ఎప్పుడు జట్టుగా ఉండేవాళ్ళం. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. 8th క్లాసుకి వచ్చాక చిన్నచిన్న  గొడవలు పెట్టుకునేవాళ్ళం. అప్పుడు రెండు గ్రూప్స్ గా విడిపోయేవాళ్ళం. రమ్య ,నేను  ఒక  గ్రూప్ప్రశాంతి , ఝాన్సీ  ఒక  గ్రూప్. ఇప్పుడు అదంతా తలచుకుంటే నవ్వొస్తుంది. 8th ఎగ్జామ్స్ అయ్యాక రమ్య వాళ్ళ నాన్నగారికి  ట్రాన్సఫర్ అయిందని వాళ్ళు బుచ్చిరెడ్డిపాళెం వెళ్ళిపోయారు. తర్వాతి సంవత్సరం ప్రశాంతి కూడా వేరే స్కూల్ కి   మారిపోయింది. 10th కి వచ్చేటప్పటికి నేను, ఝాన్సీ మాత్రమే ఉన్నాం. అప్పుడు మా క్లాసు లో  ఒక అమ్మాయి  కొత్తగా చేరింది. తన పేరు వసంత. రోజు తను,నేను ఒకే దారిలో ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా రోజూ ఒకే దారిలో వెళ్తూబాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అప్పుడపుడు నేను వాళ్ళింటికి వెళ్ళేదాన్నితను మా ఇంటికి వచ్చేది. కలిసి చదువుకునేవాళ్ళం. 10th లో మా ఇద్దరికీ ఒకే మార్క్స్ వచ్చాయి. ఇంటర్ లో నేను ఎం.పి.సి తీసుకుంటే వాళ్ళంతా  బై.పి.సి తీసుకున్నారు. వేరు వేరు కాలేజీలు . చదువు గొడవలో పడి కాంటాక్ట్స్ తగ్గాయి . ఎప్పుడైనా  వసంతని  కలుస్తున్దేడాన్ని. ఝాన్సీ ఎప్పుడైనా కనిపించేది. అప్పుడు  ఇప్పటిలా మొబైల్  వాడకం అంత ఉండేది కాదు కాబట్టి కాంటాక్ట్స్ తక్కువ. నేను బి.టెక్ లో వేరే ఊరిలో జాయిన్ అయినా ఇంటికి వెళ్లినపుడల్లా వసంతని కలిసేదాన్ని. బి.టెక్  ఫైనల్ ఇయర్ కి వచ్చేటప్పటికి మిగతావాళ్ళు కూడా కాంటాక్ట్ లోకి వచ్చారు . వసంత ఎం.ఎస్.సి చేసింది. రమ్య, ఝాన్సీ , ప్రశాంతి బి. ఎస్. సి చేసారు. నేను బి.టెక్ అయిపోయేటప్పటికి  మా నాన్నకి  మళ్లీ ఒంగోలు ట్రాన్సఫర్ అయింది. నేను ఎం.టెక్ లో జాయిన్ అయ్యాక ఎప్పుడు ఇంటికి వెళ్ళిన తిరిగి కాలేజీకి  వెళ్ళేటప్పుడు నెల్లూరులో  దిగి వసంత వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వసంత ఎప్పుడు మీరంతా సాఫ్ట్ వేర్ వాళ్ళు మేము ఎక్కడలే  అంటూ ఉండేది. నేను విని నవ్వేదాన్ని. స్కూల్ అయ్యాక నాకు ఇంటర్ లో, బి.టెక్ లో, ఎం.టెక్ లో, ఇప్పుడు ఆఫీసులో బోల్డు  మందితో స్నేహం కుదిరింది. కానీ స్వార్థం తెలియని స్వచ్చమైన మనసుల  చిన్ననాటి స్నేహం నాకు ఎప్పటికి ప్రత్యేకమే.

ప్రస్తుతం : నేను ఎం.టెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు రమ్య, ఝాన్సీలకి ఒకే నెలలో పెళ్ళిళ్ళు అయ్యాయి . సెమిస్టరు ఎగ్జామ్స్ ఉండడంవల్ల వెళ్ళలేకపోయాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు నెల్లూరు లోనే సెటిల్ అయ్యారు.    ప్రశాంతి పెళ్లి నేను ఎం.టెక్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు అయింది. ప్రాజెక్ట్ వర్క్  ఉండి వెళ్ళలేదు. తను  ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. ముగ్గురికి ఇప్పుడు ముగ్గురు బుజ్జి పాపలు. పోయిన ఏప్రిల్ లో వసంత పెళ్లి  అయింది. నేను వెళ్ళాను. మా అమ్మ కూడా వచ్చింది. ఎప్పుడు మీ సాఫ్ట్ వేర్ వాళ్ళు అనే  వసంత ఇప్పుడు అదే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.

Saturday, 5 November 2011

కన్నీళ్ళే తోడుగా... మౌనమే భాషగా...


కనురెప్పల చివరినుండి జారుతున్న కన్నీటిచుక్కని అడిగా

నువ్వెప్పుడు వస్తావని...

సమాధానమివ్వకుండా మౌనంగా జారి పెదవిని తాకింది...!!!

జాలైనా  లేకుండా మనల్ని విడదీసిన ఈ విధిని అడిగా

నిన్నెప్పుడు చూస్తానని...

జవాబైనా చెప్పకుండా ఎప్పటిలాగే  నిశ్శబ్దంగా ఉండింది...!!!

మనమధ్య పెరిగిన భయంకరమైన ఈ  దూరాన్ని  అడిగా

ఎప్పటికి కరుగుతావమ్మ అని...

ఎప్పటికీ కరగను అని తన నిర్దయను చూపించుకుంది...!!!

వీచేగాలిని, పారేయేరుని,నీలాకాశాన్ని,కురిసే వర్షాన్ని,

పున్నమి చంద్రుని, వాకిట్లో పూచిన సన్నజాజుల్ని కూడా అడిగా

నువ్వెక్కడని...

సమాధానం లేదని సంకేతమిస్తూ మౌనంగా  ఉండిపోయాయి ...!!!

Sunday, 21 August 2011

వేణుగాన సవ్వడికై....



ప్రతిక్షణమూ
యుగాల నిరీక్షణమే
వేణుగాన సవ్వడికై 
ప్రాణమిచ్చు యదసడికై   
 రావని తెలిసి చూసే
 ఎదురు చూపులో 
ఎంత జీవమాధుర్యం .....



Monday, 15 August 2011

నా ప్రాణమా...

చేరలేని తీరమా దరికిరామ్మా...
చేరువైన దూరమా ఇకనైనా కరుగుమా...